వినాయుకుడు
విశిష్టతలు : ఎవరికి పూజ చేసినా, ఏ శుభకార్యం మొదలుపెట్టినా మొదటి పూజ వినాయకుడికే జరుగుతుంది. శివుడి నుండి ఆయన పొందిన వరం ఇది. అందుకే ఆయనను 'అగ్రపూజ్యుడు' అంటారు. విఘ్నాలను కలిగించేవాడు, తొలగించేవాడు కూడా ఆయనే. మనం చేసే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించి విజయాన్ని చేకూర్చడం ఆయన విశిష్టత. మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుంటే, తన దంతాన్ని కలంగా మార్చుకుని రాసిన గొప్ప రచయిత వినాయకుడు. ఇది ఆయన మేధాశక్తికి, అంకితభావానికి నిదర్శనం.
పసిద్ద దేవాలయం : 1)అష్టవినాయక క్షేత్రాలు (మహారాష్ట్ర)
2) కణిపాకం వరసిద్ధి వినాయక స్వామి (ఆంధ్రప్రదేశ్)
తండ్రి: పరమశివుడు
తల్లి: పార్వతిదేవి
బార్యలు: సిద్ది, బుద్ది
సంతానం:
కుమారులు : శుభం(సిద్ది), లాభం(బుద్ది),
కుమార్తి: సంతోషిమాత
తొబుట్టువులు: కుమారశ్వామి, అసోకసుందరి
నివాసం: స్వానంద లోకం (ప్రత్యేక నివాసం) గణేశ పురాణం మరియు ముద్గల పురాణం ప్రకారం, వినాయకుడికి 'స్వానంద లోకం' అనే ప్రత్యేక నివాసం ఉంది. దీనినే 'గణేశ లోకం' అని కూడా అంటారు. ఇది ఎప్పుడూ ఆనందంతో నిండి ఉంటుందని వర్ణించబడింది.
మారు పేర్లు: వినాయకుడికి మనం 108 నామాలు (అష్టోత్తర శతనామావళి) చదువుతుంటాము. అందులో అత్యంత ప్రసిద్ధమైన కొన్ని 1). గణపతి 2). గణేశుడు 3). విఘ్నేశ్వరుడు 4). గజాననుడు 5).లంబోదరుడు 6).ఏకదంతుడు 7).వక్రతుండుడు 8).మూషిక వాహనుడు 9).పార్వతీ తనయుడు....
వాహనం: మూషికం (ఎలుక)
ఆయుదం: వినాయకుడి చేతిలో ప్రధానంగా ఉండే ఆయుధాన్ని 'పాశాంకుశం' అంటారు. 1). పాశం 2). అంకుశం 3). విరిగిన దంతం 4). పరశువు 5). పద్మం
పండుగలు: వినాయక చవితి, వినాయక చవితి (భాద్రపద శుద్ధ చవితి) రోజున మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ రోజు నుండి తొమ్మిది రోజుల పాటు (కొన్ని చోట్ల 11 రోజులు) ఈ ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజున విగ్రహాన్ని జల నిమజ్జనం చేస్తారు.
జన్మరహస్యం: గజముఖుడు అయిన గజాసురుడు అనే అసురుడు వదించి శ్రీమహావిష్ణువు శివుని ఆత్మలింగం తీసుకున్నప్పుడు ఆ గజాసురుడు నా తల లొకాలు అన్నిటిలొని పూజలు అందుకోవాలి అని కొరగ, శ్రీమహావిష్ణువు తదాస్తు అంటారు దానికి అనుగుణంగా శివుడు గజాశురుడు తలను వినాయుకుడుకి మొడెంకు అమర్చుతాడు., అలాగే లొకంలొ విఘ్నాలు తొలిగించడానికి వినాయుకుడు అవతారం అవిర్బిచింది.
మరణం: హిందు దర్మంలొ దేవుళ్లు, దేవతలుకు మానవులు వలె మరణాలు ఉండవు ఒక రూపం నుండి మరొక రూపంలొకి మారడం లేదా అంతర్దానం అవ్వడం జరుగుతుంది. వినాయకుడు తన కార్యసిద్ది అయిన తరువాత తన దివ్య దామానికి చేరుకునాడని పురాణాలు చెపుతున్నాయి.
జీవన వృత్తాంతం:
పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరముకోరి, తను అజేయుడుగా, ఎవరూ తనను వధించరాదని అలాగే పరమేశ్వరుడిని తన ఉదరమందు నివశించాలని వరము పొందినాడు. దాంతొ పరమశివుడు తదాస్తు అనిచెప్పి, శివుడు చిన్న ఆత్మలింగమై గజాసురుడు ఉదరములొ ఉండిపోతాడు. అది విన్న పార్వతీదేవి కలతచెంది శ్రీ మహావిష్ణువును ప్రార్థంచగా. నందీశ్వరుని గంగిరెద్దుగా, తాను (విష్ణువు) గంగిరెద్దువానిగా వేషము ధరించి గంగిరెద్దును ఆడించి గజాసురిని మెప్పించగా దాంతొ గజాసురుడు నీకు ఏమి కావాలొ కొరుకొ నేను నీకు మాట తప్పకుండా ఇస్తాను అని చెప్పగా, ఉదరమందున్న పరమశివుని కోరినాడు. ఇదంతా విష్ణుమాయ అని గ్రహించిన గజాసురుడు, తనకు చేటుకాలము దాపురించిందని తలచి, శివుని ఉద్దేశించి ప్రభూ! శ్రీహరి ప్రభావముచే నా జీవితము ముగియనున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోకములు పూజించునట్లు, నా చర్మము నిరంతరము నీవు ధరించునట్లు వరము ఇవ్వమని, తన శరీరమును నందీశ్వరునికి వశము చేసి శివునకు ఉదరకుహరము నుండి విముక్తి కలిగించాడు.ఆ శుభవార్తను విన్న పార్వతి దేవీ అభ్యంగన స్నానమాచరించి భర్తను స్వాగతించాలని తలచి నలుగుపిండితో ఒక బాలుని బొమ్మను చేసి దానికి ప్రాణ ప్రతిష్ట చేసి స్నానవాకిట ముందు కాపలాగా ఉంచింది. ఇంతలోనే పరమశివుడు ఎంతో సంతోషముతో పార్వతి చెంత చేరాలని వస్తుండగా.. ఆ బాలుడు అభ్యంతరం తెలియజేస్తూ.. ముక్కంటిని నిలువరిస్తాడు. దీంతో ఆవేశమునకు లోనైన పరమేశ్వరుడు ఆ బాలునికి శిరచ్ఛేదము చేసినాడు.అది చూచిన మహేశ్వరి దుఃఖమును తీర్చుటకై తన వద్దనున్న ఆ గజశిరమును ఆ బాలునికి అతికించి ప్రాణ ప్రతిష్ట చేసి, ఆ గజాననునికి, తన రెండో కుమారుడైన కుమారస్వామికి మధ్య భూప్రదక్షిణ పోటీ పెట్టి త్రిలోకపూజితుడిగా గణాధిపత్యమును శివుడు ఆ బాలునికి కలిగించినాడని పురాణాలు చెబుతున్నాయి.