Sanatana Dharma.net

stusti 🏠

సృష్టి...

ఈ సృష్టి కి ముందు సర్వం శూన్యం. మన పురాణాలు ప్రకారం బ్రహ్మదేవుడు మొట్టమొదట కళ్ళు తెరిచి చూసినప్పుడు జగమంతా శూన్యం. అప్పుడు బ్రహ్మదేవుడు నేను ఎవరిని ఎలా వచ్హాను, అని తనను తాను ప్రశ్నించికొని తాను ఉన్న కమలంలొ నుండి కిందకు దిగి వస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడుకు శ్రీమహవిష్ణువు కనిపిస్తాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ శ్రీమహవిష్ణువును నేను ఎవరను నా పుట్టుక ఏమి అని అడుగగ, దానికి శ్రీమహవిష్ణువు నువ్వు నా నాభి నుండి ఉద్బవించావు అని తెలుపగ దానికి బ్రహ్మదేవుడు లేదు,లేదు నేనే ఈ సృష్టి మూలం, నేనే ముందు పుట్టాను అని శ్రీమహావిష్ణువు తొ వాదించ సాగాడు. ఇరువురు నేనేంటే నేనే ముందు అని వాదించుకుంటూ ఉండగా శూన్యం నుండి మాటలు(ఆకాశ వాణి) వస్తాయి. అవి నేను మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. అని చెప్పి ఒక అగ్ని లింగం సృష్టి చేసి ఈ లింగం యొక్క ఆది మరియు అంతం ఎమిటొ తెలుసుకుని రండి అని చెపుతుంది. ఆ తర్వాత ఎవరు ముందు అనేది మీకే తెలుస్తుంది అని చెపుతుంది. అప్పుడు బ్రహ్మ మరియు విష్ణు దేవులు ఇరువురు ఆ అగ్ని లింగం ఆది, ఆంతం తేల్చుటకు ప్రయత్నిస్తారు కాని ఎంతకీ ఆ అగ్ని లింగం యొక్క ఆది, మరియు అంతం కనుగొనలేరు దాంతొ విషయం ఇరువురికి బొదపడి, మా ఇరువురు కంటే వేరే శక్తి ఎదోవుంది, అని తెలుసుకొంటారు. అప్పుడు పరమ శివుడు ప్రత్యక్షమై, నేనే అది పురుషుడను ఈ బ్రహ్మడమంతా నేనే, మీ ఇరువురు నా అంశ, సృస్టి కి బ్రహ్మ, సిత్థి కి విష్ణు, లయం కి నేనైన ఈస్వరుడను ఇకనుండి మనం త్రిమూర్తులుగా పిలువభడతాం. అని చెప్పెను, అప్ఫటినుండి బ్రహ్మదేవుడు సకల చెర జల జీవరాసులును పుట్టించాడు. విష్ణువు ఆ సృస్టి లొ జీవులునుని కాపాడుతుంటాడు, అలాగే పరమ శివుడు సృస్టి లొ జీవులును తిరిగి పునర్జీవం కొరకు సకలజీవులును వాటి యొక్క ఆయుర్దాయం (ఆయుష్షు) బట్టి అంతమొందిస్తాడు అలా ఈ సృస్టి మొదలైయినది.