Sanatana Dharma.net

🏠

పరమేశ్వరుడు


పరమేశ్వరుడు

విశిష్టతలు : శివపురాణం ప్రకారం శివుడే ఆదిదేవుదు, శివుడు లయకారుడు లయం అంటే అంతం చేయడం మాత్రమే కాదు, పాత దాన్ని తొలగించి కొత్త దానికి నాంది పలకడం. అహంకారాన్ని, అజ్ఞానాన్ని నాశనం చేసి జీవుడికి మోక్షాన్ని ప్రసాదించే బాధ్యత శివుడిది. పరమేశ్వరుడి త్రినేత్రం (మూడవ కన్ను) కేవలం ఒక శారీరక అవయవం మాత్రమే కాదు, అది అత్యున్నతమైన జ్ఞానానికి మరియు శక్తికి చిహ్నం

తండ్రి: లేరు

పసిద్ద దేవాలయం :1). ద్వాదశ జ్యోతిర్లింగాలు(12)

2).పంచభూత లింగాలు(తమిళనాడు & ఆంధ్రప్రదేశ్)

తండ్రి: లేరు

తల్లి: లేరు

బార్యలు: పార్వతిదేవి

సంతానం:
కుమారులు: వినాయుకుడు, కుమారస్వామి
కుమార్తి: అసోకసుందరి, జ్యోతి, మానస దేవి

తొబుట్టువులు: లేరు

నివాసం: కైలాస పర్వతం, శివుడిని 'స్మశానవాసి' అని కూడా అంటారు. ఆయన స్మశానంలో నివసిస్తూ, ఒంటి నిండా బూడిద (విభూతి) పూసుకుంటారు. పుట్టిన ప్రతి ప్రాణి చివరకు బూడిద కావాల్సిందే అనే పరమ సత్యాన్ని, జీవితం తాత్కాలికమని ఆయన మనకు గుర్తు చేస్తారు. లోకం అంతా అసహ్యించుకునే చోట ఆయన నివసిస్తూ, అక్కడ ఉండే అనాథ ప్రేతాత్మలకు దిక్కుగా ఉంటారు.

జన్మరహస్యం : పరమేశ్వరుడు అజన్ముడు' (జన్మ లేనివాడు), 'స్వయంభూ' (తనంతట తానుగా ఆవిర్భవించినవాడు) అని హిందూ ధర్మం చెబుతుంది. శివునికి తల్లిదండ్రులు లేరు. అందుకే ఆయన్ని "అనాది" (మొదలు లేనివాడు) అని పిలుస్తారు. పరమేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి.

మరణం: లేదు

పండుగలు: మహాశివరాత్రి,కార్తీక పూర్ణిమ

ఆయుదం: త్రిశూలం, పాశుపతాస్త్రం, పరశువు, పినాకం(విల్లు),

వాహనం: నంది

మారు పేర్లు : శివ సహస్రనామలు ప్రకారం శివునికి 1000 పేర్లు ఉన్నాయి, అందులొ బాగా ప్రాముఖ్యంగా ఉన్నవి.
ఈశ్వరుడు, శివుడు, మాహదేవుడు, హర, సదాశివ, కాశీ విశ్వనాథుడు, భీమశంకరుడు, కేదారేశ్వరుడు, శంకరుడు, నీలకంఠుడు, ముక్కంటి, పశుపతి.......

జీవన వృత్తాంతం: శివుని జీవితం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే—సమస్త ఐశ్వర్యాలు ఉన్నా సాదాసీదాగా ఉండటం (వైరాగ్యం), లోక కష్టాలను (విషాన్ని) మనం భరించి ఇతరులకు సుఖాన్ని (అమృతాన్ని) ఇవ్వడం. శివుడు మొదట దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని వివాహం చేసుకున్నాడు. కానీ దక్షుడు శివుడిని అవమానించడంతో, సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. శివుడు ఆగ్రహించి తన జటాజూటంతొ వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. తర్వాత సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు చేసిన తాండవం చేస్తాడు చేస్తున్నప్పుడు, లోకకళ్యాణం కోసం శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన చోటల్లా ఒక్కో శక్తి వెలిసింది. ఆ ప్రదేశాలలో శివుడు భైరవుడి రూపంలో అమ్మవారికి రక్షణగా ఉంటాడు.