పార్వతిదేవి
విశిష్టతలు : ఆదిశరాశక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవి, పరమేశ్వరుడి సహధర్మచారిణిగా, సృష్టికి మూలమైన శక్తిగా అత్యంత విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. పార్వతీ దేవికి ప్రధానంగా రెండు రకాలైన రూపాలు ఉన్నాయి.
తండ్రి: హిమవంతుడు
తల్లి: మేనాదేవి
భర్త: పరమేశ్వరుడు
సంతానం:
కుమారులు: వినాయుకుడు, కుమారస్వామి
కుమార్తి: అసోకసుందరి, జ్యోతి, మానస దేవి
తొబుట్టువులు: అన్నయ్య (మైనాకుడు)
నివాసం: కైలాస పర్వతం, ఆధ్యాత్మిక శాస్త్రం మరియు దేవీ భాగవతం ప్రకారం, పార్వతీ దేవి 'ఆదిపరాశక్తి' స్వరూపంలో మణిద్వీపంలో నివసిస్తుంది.
వాహనం: సింహము/పులి
ఆయుదం: త్రిశూలం, ఖడ్గం, చక్రం, పినాకం(విల్లు), శంఖం, గద, అంకుశం, పద్మం
జన్మరహస్యం: పార్వతి జన్మ వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి:
మరణం: లేదు
పండుగలు: దేవీ నవరాత్రులు, వరలక్ష్మి వ్రతం, బోనాలు
జీవన వృత్తాంతం:
పార్వతీ దేవి యొక్క పూర్వ అవతారమైన సతీదేవి, తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక యోగాగ్నిలో తన శరీరాన్ని ఆహుతి చేసింది. ఇది మరణం కాదు, అది ఒక భౌతిక దేహాన్ని వదిలిపెట్టడం.ఆ సమయంలోనే ఆమె తన తర్వాతి జన్మలో శివుని ఆరాధించే గొప్ప తండ్రికి పుట్టాలని నిశ్చయించుకుంది. ఆ సంకల్పం నుండే 'పార్వతి' జన్మించింది. అలా చిన్నతనం నుండే శివుడిని భర్తగా పొందాలని పార్వతి నిశ్చయించుకుంది. పరమశివుడు అప్పటికే సతీదేవి వియోగంలో ధ్యానంలో ఉండటంతో, ఆయనను మెప్పించడానికి పార్వతి ఘోరమైన తపస్సు చేసింది. సతీదేవి వియోగంతొ వైరాగ్యంలో ఉన్న శివుడు పార్వతీ తప్పస్సు మెచ్చి బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆమెను పరీక్షించి, చివరకు ఆమెను స్వీకరించడానికి అంగీకరించాడు. అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ శివ-పార్వతుల కళ్యాణం లోకకళ్యాణానికి దారితీసింది. వీరిద్దరి కలయికనే 'ప్రకృతి-పురుష' తత్వంగా పిలుస్తారు. లోకానికి శక్తి మరియు జ్ఞానం యొక్క సమతుల్యతను వీరిద్దరూ చూపిస్తారు. తారకాసురుడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి శివపార్వతుల తేజస్సుతో కుమారస్వామి (కార్తికేయుడు) జన్మించాడు. అలాగే, పార్వతీ దేవి తన ఒంటి నలుగు పిండితో ప్రాణం పోసి వినాయకుడిని సృష్టించింది. కుమారస్వామి మరియు వినాయకుడు ఇద్దరూ పార్వతీ దేవికి అత్యంత ప్రియమైన పుత్రులు.పార్వతీ దేవి కేవలం శాంత స్వరూపిణి మాత్రమే కాదు, అవసరమైనప్పుడు దుష్టశిక్షణ కోసం అనేక రూపాలు దాల్చింది. అందులొ కొన్ని దుర్గాదేవి, కాళికాదేవి, అన్నపూర్ణ మొదలగు రూపాలు దాల్చింది.అందుకే ఈమె లోక మాతగా పిలవబడుతుంది.