శ్రీమహాలక్ష్మి
విశిష్టతలు :
సంపద, సౌభాగ్యం, శుభం మరియు ఐశ్వర్యానికి అధిదేవత. ఆమెను "అష్టలక్ష్మి" రూపాల్లో కొలుస్తాము. ఒక చేయి నుండి బంగారు నాణేలు పడుతున్నట్లు కనిపిస్తుంది, ఇది భక్తులకు ఇచ్చే ఐశ్వర్యాన్ని, సమృద్ధిని సూచిస్తుంది. లోకానికి ఎనిమిది రకాల సంపదలను ప్రసాదించడానికి లక్ష్మీ దేవి ఎనిమిది రూపాలు ధరించింది. వీటిని అష్టలక్ష్మిలు అంటారు.
ప్రసిద్ద దేవాలయాలు:
1).కొల్హాపూర్ శక్తిపీఠంలో (మహారాష్ట్ర)అమ్మవారు మహాలక్ష్మి (అంబాబాయి) గా కొలువై ఉంటుంది.
2).తిరుచానూరు పద్మావతి అమ్మవారు (ఆంధ్రప్రదేశ్) కార్తీక మాసంలో పంచమి తీర్థం నాడు పద్మ సరోవరంలో ఆవిర్భవించారు.
తండ్రి: భృగు మహర్షి , ఆ తర్వాత లోక కల్యాణం కోసం సముద్ర మథనంలో తిరిగి ఆవిర్భవించింది.
తల్లి: ఖ్యాతి
భర్త: శ్రీమహావిష్ణువు
సంతానం:
కుమారులు: ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు, శ్రీప్రదుడు,మన్మధుడు
కుమార్తి:సంతానలక్ష్మి రూపంలో ఆమె భక్తులకు ఇచ్చే పిల్లలందరూ ఆమె స్వరూపాలే.
తొబుట్టువులు: చంద్రుడు
నివాసం: వైకుంఠం: శ్రీమహావిష్ణువు హృదయంలో (శ్రీవత్సం అనే చిహ్న రూపంలో) అమ్మవారు నిరంతరం నివసిస్తారు.
వాహనం: గుడ్లగూబ ( ఉలూకం)
జన్మరహస్యం: అమృతం కోసం క్షీరసాగర మథనం (సముద్ర మథనం) చేస్తున్నప్పుడు మహాలక్ష్మి ఉద్భవించింది. అందుకే ఆమెను "క్షీరసాగర తనయ" అని కూడా అంటారు.
పండుగలు: వరలక్ష్మి వ్రతం, దీపావళి, ధన త్రయోదశి, శరద్ పూర్ణిమ
మరణం: లేదు, ఆమె 'అమృత స్వరూపిణి' మరియు 'నిత్యురాలు'
మహాలక్ష్మి దేవి శ్రీమహావిష్ణువు యొక్క అనపాయినీ ఎప్పటికీ విడిపోనిది శక్తి.
జీవన వృత్తాంతం: పూర్వం దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వల్ల దేవతలు తమ శక్తిని, ఐశ్వర్యాన్ని కోల్పోతారు.పోగొట్టుకున్న వైభవాన్ని, అమృతాన్ని తిరిగి పొందడం కోసం దేవతలు మరియు అసురులు కలిసి వాసుకి అనే పామును తాడుగా, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాలసముద్రాన్ని మథిస్తారు. అప్పుడు అత్యంత ప్రకాశవంతమైన కాంతితో, చేతిలో పద్మాన్ని ధరించి, సంపూర్ణ యవ్వనవతిగా శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఫాల్గుణ మాసం, పౌర్ణమి తిథి నాడు ఆవిర్భవించిందని చెబుతారు. అందుకే ఆ రోజు లక్ష్మీ పూజకు ఎంతో విశిష్టత ఉంది. ఆమె పుట్టిన వెంటనే గంధర్వులు గానం చేశారు, దిగ్గజాలు (ఏనుగులు) బంగారు కలశాలతో ఆమెకు అభిషేకం చేశాయి. అందుకే ఆమెను 'గజలక్ష్మి' అని కూడా అంటారు.ఆమె సద్గుణ సంపన్నుడైన, సర్వవ్యాపి అయిన శ్రీమహావిష్ణువును చూసి, ఆయన వక్షస్థలం (హృదయం)పై నివసించడానికి ఆయన్ని భర్తగా వరిస్తుంది. నాటి నుండి ఆమె విష్ణువును వదలని 'అనపాయినీ' గా మారింది. శ్రీమహావిష్ణువు ఎక్కడ ఉంటే, లక్ష్మీదేవి అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన రాముడిగా అవతరిస్తే ఆమె సీతగా, కృష్ణుడిగా అవతరిస్తే ఆమె రుక్మిణిగా.. ఇలా ప్రతి అవతారంలోనూ ఆయనను వదలకుండా వెన్నంటే ఉంటుంది. అందుకే ఆమెను 'విష్ణువనపాయినీ' అంటారు