బ్రహ్మదేవుడు
విశిష్టతలు : బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని, అందులోని సమస్త జీవరాశులను సృష్టించినవాడు. అందుకే ఆయనను 'ప్రజాపతి' లేదా 'లోకపితామహుడు' అని పిలుస్తారు. బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు ఉంటాయి. ఇవి కేవలం దిక్కులను మాత్రమే కాకుండా, నాలుగు వేదాలను (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం) సూచిస్తాయి. జ్ఞానానికి మూలం ఆయనే అని దీని అర్థం.
పసిద్ద దేవాలయం: పుష్కర్ బ్రహ్మ దేవాలయం (రాజస్థాన్)
తండ్రి: లేరు
తల్లి: లేరు
బార్య: సరస్వతీదేవి
సంతానం: మానవ సృష్టి కోసం బ్రహ్మ తన శరీరం నుండి స్వయంభువ మనువును (పురుషుడు), శతరూపను (స్త్రీ) సృష్టించారు. వీరి నుండే మానవజాతి ప్రారంభమైందని చెబుతారు.అలాగే బ్రహ్మ దేవుడి సంతానాన్ని 'మానస పుత్రులు' అని పిలుస్తారు. అంటే బ్రహ్మ తన సంకల్పం (మనస్సు) ద్వారా వీరిని సృష్టించారు
కుమారులు:1).మరీచి 2).అత్రి 3).అంగీరసుడు 4). పులస్త్యుడు 5).పులహుడు 6). క్రతువు 7).భృగువు 8).వశిష్ఠుడు 9).దక్షుడు 10). నారదుడు 11).సనకాది మునులు
కుమార్తి: శతరూప
తొబుట్టువులు: లేరు
మారు పేర్లు : పద్మభవుడు, నాభిజన్ముడు
నివాసం: సత్యలోకం' లేదా 'బ్రహ్మలోకం'
ఆయుదం: ఆయుధాలు ఉండవు. బదులుగా వేదాలు, జపమాల, కమండలం (నీటి పాత్ర) మరియు సృక్ (యజ్ఞం చేసే గరిటె) ఉంటాయి.
వాహనం: హంస
మరణం: లేదు, బ్రహ్మదేవుడి ఒక్క పగలును 'కల్పం' అంటారు. మన లెక్క ప్రకారం అది కోట్ల సంవత్సరాలతో సమానం. ఆయన ఒకసారి కనురెప్ప వేసి తీసే లోపు భూమిపై ఎన్నో యుగాలు గడిచిపోతాయని పురాణాలు చెబుతాయి.
పండుగలు: పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి శాపం ఉండటం వల్ల ఆయనకు ప్రత్యేకమైన తిథులు లేదా వారోత్సవాలు సాధారణంగా ఉండవు. కార్తీక పూర్ణిమ: ఈ రోజున పుష్కర్‌లో భారీ ఉత్సవం జరుగుతుంది. వేల సంఖ్యలో భక్తులు పుష్కర్ సరస్సులో స్నానం చేసి బ్రహ్మదేవుడిని దర్శించుకుంటారు. ఇది ఆయనకు సంబంధించి అతిపెద్ద పండుగ. తరువాత బ్రహ్మదేవుడు స్వయంగా భూలోకానికి వచ్చి వేంకటేశ్వర స్వామికి నిర్వహించే ఉత్సవాలు కాబట్టి వీటికి 'బ్రహ్మోత్సవాలు' అని పేరు వచ్చింది. ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో మొదటి రోజు బ్రహ్మదేవుడికి ఆహ్వానం పలుకుతూ పూజలు చేస్తారు.
జన్మరహస్యం: పురాణాల ప్రకారం, మహావిష్ణువు నాభి (బొడ్డు) నుండి ఉద్భవించిన తామర పువ్వులో బ్రహ్మ జన్మించారు. అందుకే ఆయనను 'పద్మభవుడు' లేదా 'నాభిజన్ముడు' అని కూడా పిలుస్తారు. మరికొన్ని పురాణాలు ప్రకారం, ఈ విశ్వాన్ని సృష్టించడానికి హిరణ్యగర్భం (బంగారు అండం) నుండి ఆయన ఆవిర్భవించారు.
జీవన వృత్తాంతం: బ్రహ్మదేవుడు కేవలం దేవతలను, మనుషులనే కాకుండా, ఈ సృష్టిలోని సమస్త జీవరాశులను, కాలగమనాన్ని సృష్టించారు. ఆయన మానస పుత్రులైన సనకసనందనాదులు, సప్తర్షులు సృష్టి కార్యంలో ఆయనకు సహాయం చేస్తారు.